Minister Narayana: వైసీపీ హయాంలో పారిశ్రామిక రంగం నిర్వీర్యం
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:52 AM
రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి పొంగూరి నారాయణ ఆరోపించారు.
పెట్టుబడిదారులు పక్క రాష్ట్రాలకు పారిపోయారు: మంత్రి నారాయణ
కాకినాడ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి పొంగూరి నారాయణ ఆరోపించారు. పరిశ్రమల స్థాపనకు వచ్చేవారిని బెంబేలెత్తించి, ఇతర రాష్ట్రాలకు పారిపోయేలా చేసిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కేవలం 16 నెలల కాలంలో రూ.9లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుందని తెలిపారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద జిల్లా పరిశ్రమలు, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘పరిశ్రమలు-ఉపాధి కల్పన’ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాకినాడ పోర్టులో ఎంఏటీ మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణ, పెద్దాపురంలో సంతోషిమాత కారు గేటర్స్ పరిశ్రమ, శంఖవరం మండలం ఆరంపూడిలో ఓ పరిశ్రమ, తునిలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు శిలాఫలకాలను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ హయాంలో పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదని అన్నారు.