Minister Nara Lokesh: 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధిస్తాం
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:58 AM
దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం ఖాయమని, అయితే దానిని ఎంత త్వరగా చేరుకోగలమనేదే అసలు ప్రశ్న అని మంత్రి లోకేశ్ అన్నారు.
సీఐఐ దక్షిణ ప్రాంత సదస్సులో మంత్రి లోకేశ్
తుళ్లూరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం ఖాయమని, అయితే దానిని ఎంత త్వరగా చేరుకోగలమనేదే అసలు ప్రశ్న అని మంత్రి లోకేశ్ అన్నారు. దక్షిణ ప్రాంత కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ర్టీ (సీఐఐ సదరన్ రీజియన్) ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్య పునర్ వ్యవస్థీకరణ ద్వారా భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు’ అనే అంశంపై వీఐటీ - ఏపీ విశ్వవిద్యాలయం అమరావతి క్యాంప్‌సలో బుధవారం జరిగిన సమావేశంలో లోకేశ్ ప్రసంగించారు. దేశం ఆశయాన్ని పరిమితం చేసుకోకూడదని, 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవాలన్నారు. సీఐఐ దక్షిణ ప్రాంతం కాలేజ్ ఎక్సలెన్స్ క్లస్టర్ 2025, వీఐటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సెల్వం మాట్లాడుతూ... దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు విద్యాసంస్థల సహకారం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎస్వీ కోటారెడ్డి, ప్రొఫెసర్ కె.రత్నషీలామణి(ఏపీ ేస్టట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్), శరణం నరేంద్ర కుమార్ (వైస్ చైర్మన్, సీఐఐ ఆంధ్రప్రదేశ్) తదితరులు పాల్గొన్నారు.