Minister Lokesh: వైసీపీ వ్యవస్థీకృత నేరగాళ్ల ఫేక్ ప్రచారం
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:48 AM
ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి అంటూ వైసీపీ సోషల్ మీడియాలో వేరే రాష్ట్రాలకు చెందిన పాత ఫొటోలతో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి లోకేశ్ మండిపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి అంటూ వైసీపీ సోషల్ మీడియాలో వేరే రాష్ట్రాలకు చెందిన పాత ఫొటోలతో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘నిన్న గురుకుల పాఠశాల... నేడు రోడ్లు... వైసీపీ హాబిచ్యువల్ అఫెండర్స్ మరోసారి ఫేక్ ప్రచారానికి దిగారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అంటూ వేరే రాష్ట్రానికి చెందిన ఫొటోలతో అసత్య ప్రచారం చేస్తున్నారు. పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత డ్రైవింగ్‌పై ప్రజలను చైతన్యపరిచేందుకు గుజరాత్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి 2022లో చేసిన పోస్టును వైసీపీ ఫేకూలు ఏపీ రోడ్డుగా చిత్రీకరిస్తూ అధ్వాన్న రోడ్ల కారణంగా స్కూలు బాలికపై బురదపడినట్లు వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రచారం చేస్తోంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు’ అంటూ మంత్రి లోకేశ్ ఎక్స్‌లో హెచ్చరించారు.