West Godavari District: నేడు పాలకొల్లుకు మంత్రి లోకేశ్
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:04 AM
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించనున్నారు.
పాలకొల్లు టౌన్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించనున్నారు. జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ నిశ్చితార్థ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొంటారని మంత్రి నిమ్మల కార్యాలయం తెలిపింది. మంత్రి లోకేశ్‌తో పాటు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొంది.