Share News

Minister Lokesh: మీ పెట్టుబడికి మాదీ పూచీ

ABN , Publish Date - Oct 25 , 2025 | 04:40 AM

ఆంధ్రప్రదేశ్‌ స్టార్టప్‌ రాష్ట్రమని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి సంపూ ర్ణ భరోసా ఇచ్చారు.

Minister Lokesh: మీ పెట్టుబడికి మాదీ పూచీ

  • ఒకసారి ఏపీతో చేతులు కలిపాక మీ ప్రాజెక్టు మాదే: లోకేశ్‌

  • అన్ని దశల్లో నిరంతరం పర్యవేక్షిస్తాం

  • 16 నెలల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులు

  • 2047కి గ్లోబల్‌ పవర్‌ హౌస్‌గా ఏపీ

  • వచ్చే జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటర్‌ సేవలు

  • ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి వెల్లడి

అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ స్టార్టప్‌ రాష్ట్రమని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి సంపూ ర్ణ భరోసా ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు ఒకసారి తమతో చేతులు కలిపాక.. ప్రాజెక్టు ప్రతిపాదనలు తమవిగా భావించి అనుమతులివ్వడం సహా.. ఉత్ప త్తి ప్రారంభమయ్యేదాకా సహకారం అందిస్తూ ఉం టామని భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆస్ట్రేలియా పర్యటన చివరి రోజు.. ఆరో రోజున ఆయన మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమిట్‌ రోడ్‌షో నిర్వహించారు. ఆస్ట్రేలియా ట్రేడ్‌ ఇన్వెస్టిమెంట్‌ కమిషన్‌ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశమయ్యారు. విశాఖలో వ చ్చే నెల 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు తరలిరావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపిచ్చారు. ఎడ్యుకేషన్‌పై జరిగిన రౌం డ్‌ టేబుల్‌ భేటీకీ హాజరయ్యారు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియంను సైతం సందర్శించి.. క్రికెట్‌ విక్టోరియా అసోసియేషన్‌ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆయా సందర్భాల్లో లోకేశ్‌ మాట్లాడారు. ఏదైనా సం స్థ నుంచి పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదన వచ్చిన వెంటనే ఒక వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేస్తామని.. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు, నాయకుల తో ప్రతిరోజూ మెసేజ్‌ల ద్వారా సంప్రదింపులు జరుపుతూనే ఉంటామని తెలిపారు. ప్రాజెక్టు స్థితిగతుల ను అనుక్షణం తెలుసుకుంటామన్నారు.


ఉదాహరణకు ఆతిథ్య సేవల రంగంలో ఈ రోజు ఉదయం ఒ క కంపెనీకి భూ కేటాయించాల్సి ఉంటే.. సంబంధిత ఫైలు ఎక్కడ ఉంది.. క్లియరెన్సుకు ఎంత సమయం పడుతుంది.. అనే వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని వెల్లడించారు. నిర్దేశించిన సమయం కంటే ముందుగానే అనుమతులన్నింటినీ ఇచ్చేస్తామ ని చెప్పారు. ఇచ్చిన హామీని అమలు చేయడం తమకు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. 16 నెలల్లోనే రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. సుదీర్ఘ పాలనానుభవం కలిగిన సీఎం చంద్రబాబు నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. రాజధాని అమరావతిలో క్వాం టమ్‌ కంప్యూటర్‌ సేవలు వచ్చే ఏడాది జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు.


విజనరీ నేతృత్వంలో..

విజనరీ సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ ఏరోస్పేస్‌, రక్షణ, రేవులు, ఫార్మా, బయోటెక్నాలజీ, పర్యాటకం వంటి రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి. విశాఖ ఇన్నోవేషన్‌ డేటా హబ్‌గా తయారవుతోంది. భారత్‌లో పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోండి. దీనికి 3 కారణాలున్నాయి. మా రాష్ట్రంలో అనుభవం కలిగిన దార్శనిక నాయకత్వం ఉంది. కేంద్రం సహకారం కూడా ఉం ది. ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైనవారే. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు. రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు మేమంతా కష్టపడుతున్నాం. క్రికెట్‌ విక్టోరియా ఏపీలోనూ క్రికె ట్‌ అకాడమీని నెలకొల్పాలి. ఉమ్మడి శిక్షణ శిబిరాలు, మ్యాచ్‌ల నిర్వహణపై దృష్టి సారించాలి.


గూగుల్‌ రాక వెనుక..13 నెలల కష్టం

సంస్థ ప్రతినిధులు వచ్చినప్పుడు నేనే స్వయంగా వెళ్లి స్థలం చూపించా: లోకేశ్‌

విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌ రావడం వెనుక 13 నెలల కష్టం దాగి ఉందని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. గూగుల్‌ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు.. తానే స్వయంగా వెళ్లి ప్రాజెక్టు స్థలాన్ని చూపించానని సీఐఐ రోడ్‌షోలో చెప్పారు. ‘నేను వారి కార్పొరేట్‌ కార్యాలయానికి వెళ్లి.. ఎందుకు రాష్ట్రంలో గూగుల్‌ డేటా సెంటర్‌ పెట్టాలో వివరణాత్మకంగా తెలియజేసి నచ్చజెప్పాను. తర్వాత గూగుల్‌ నాయకత్వం సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాల్లో కొన్ని మార్పుచేర్పులు సూచించింది. వెంటనే చంద్రబాబు వాటిపై ప్రధాని మోదీతో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో, కేంద్ర ఐటీ-ఎలకా్ట్రనిక్స్‌ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించారు. సదరు మార్పులు చేయడానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. గూగుల్‌ సెంటర్‌ ఏర్పాటు దిశగా విధివిధానాలను సవరించింది. ఈ ప్రక్రియతో గూగుల్‌ డేటా సెంటర్‌ రావడమే గాకుండా.. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే ఐటీ కంపెనీలన్నింటికీ ప్రయోజనం కలిగింది. భారత్‌ గ్లోబల్‌ ఐటీ సెంటర్‌గా ఎదిగేందుకు కేంద్ర నిర్ణయం దోహదపడింది. ఇలా గూగుల్‌ డేటా సెంటర్‌ను విశాఖకు తీసుకొచ్చేందుకు 13 నెలలు అహర్నిశలూ కష్టపడ్డాం. అయితే చెప్పిన సమయం కంటే ఒక నెల ఆలస్యమైనందుకు ఇప్పటికీ బాధపడుతున్నాం’ అని లోకేశ్‌ వివరించారు. ఆస్ట్రేలియాలో ఆర్రోజుల పర్యటన ముగించుకున్న ఆయన శనివారం హైదరాబాద్‌కు రానున్నారు.

Updated Date - Oct 25 , 2025 | 04:42 AM