Minister Lokesh: శ్రీఆది చుంచనగిరి క్షేత్రంలో లోకేశ్
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:18 AM
కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని ప్రముఖ సామాజిక ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని రాష్ట్ర మంత్రి లోకేశ్ ఆదివారం సందర్శించారు...
అమరావతి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని ప్రముఖ సామాజిక ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని రాష్ట్ర మంత్రి లోకేశ్ ఆదివారం సందర్శించారు. 1800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మఠంలోని శ్రీకాలభైరవ స్వామివారిని లోకేశ్ దర్శించుకున్నారు. అనంతరం మఠం 72వ పీఠాధిపతి జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామిజీ ఆశీర్వాదం పొందారు. మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంవిత్ పాఠశాలల గురించి అడిగి తెలుసుకున్నారు. పేదల విద్యార్థులకు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని వసతులతో ఉచిత విద్యను అందిస్తున్నట్లు మఠం నిర్వాహకులు లోకేశ్‌కు వివరించారు. ఇంటర్ తర్వాత ఎక్కడ డిగ్రీ చదవాలనుకున్నా మఠం ఆర్థికసాయం అందిస్తుందని వివరించారు. ఏపీలోనూ పేద విద్యార్థులకు ఉపయోగపడేలా సంవిత్ పాఠశాల ప్రారంభించాలని లోకేశ్ మఠం నిర్వాహకులను కోరారు. దీనికి మఠాధిపతి అంగీకరించారు.