Minister Lokesh: ఆర్డీటీ సేవలు యథాతథం
ABN , Publish Date - Nov 11 , 2025 | 05:31 AM
లక్షలా ది పేదల బతుకుల్లో వెలుగు నింపిన ఆశా కిరణం ఆర్డీటీ(రూరల్ డెవల్‌పమెంట్ ట్రస్ట్) సేవలు యథాతథంగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేశ్
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): లక్షలా ది పేదల బతుకుల్లో వెలుగు నింపిన ఆశా కిరణం ఆర్డీటీ(రూరల్ డెవల్‌పమెంట్ ట్రస్ట్) సేవలు యథాతథంగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. పాదయాత్రలో ఆర్డీటీ సేవలను పరిశీలించిన లోకేశ్, సంస్థ ప్రజలకు అందిస్తున్న సేవలు అద్భుతమని ప్రశంసించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆర్డీటీ వంటి మానవతా సంస్థకు తాత్కాలికంగా ఎదురైన ఇబ్బందులను పరిష్కరించే బాధ్యత తనదని, ఆర్డీటీ నిర్వాహకుడు మాంఛో ఫెర్రర్‌కు లోకేశ్ మాటిచ్చారు. ఆ మేరకు కేంద్రంతో మాట్లాడి ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు పునరుద్ధరించేందుకు ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించారు. ఒకటి రెండు రోజుల్లో ఆర్డీటీ కార్యకలాపాలకు ఏర్పడిన ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరించిన లోకేశ్‌కు సంస్థ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.