Share News

Cultural Heritage: కూలిన కాలజ్ఞాని బ్రహ్మంగారి ఇల్లు

ABN , Publish Date - Oct 30 , 2025 | 06:32 AM

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లయ్యపల్లె గ్రామంలో కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం ఉన్న ఇల్లు పాక్షికంగా నేలమట్టమైంది.

Cultural Heritage: కూలిన కాలజ్ఞాని బ్రహ్మంగారి ఇల్లు

  • తుఫాను ధాటికి పాక్షికంగా నేలమట్టం

  • పునర్నిర్మించాలని కలెక్టర్‌ను కోరిన మంత్రి లోకేశ్‌

బ్రహ్మంగారిమఠం/కడప, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లయ్యపల్లె గ్రామంలో కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం ఉన్న ఇల్లు పాక్షికంగా నేలమట్టమైంది. తుఫాను ప్రభావంతో మంగళవారం కురిసిన వర్షాలకు ఇంట్లోని స్తంభం కుంగిపోయింది. దీంతో ఇంటి గోడతో పాటు శ్లాబు కుప్పకూలింది. కాగా, వీరబ్రహ్మేంద్రస్వామి ఇంటిని పునరుద్ధరించడానికి, మన సాంస్కృతిక వారసత్వంలోని ఈ విలువైన భాగాన్ని కాపాడటానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ను మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’లో కోరారు. బుధవారం రాత్రి బ్రహ్మంగారి గృహాన్ని కలెక్టర్‌ పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, కూలిన ఇంటిని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అదే మెటీరియల్‌తో ప్రత్యేక ఆర్కిటెక్చర్‌, ధార్మిక పరిషత్‌ సలహాలు, సూచనలతో పునర్నిర్మిస్తామని తెలిపారు.

Updated Date - Oct 30 , 2025 | 01:23 PM