Share News

Minister Lokesh: క్వాంటమ్‌ రిసెర్చ్‌లో భాగస్వాములవ్వండి

ABN , Publish Date - Oct 24 , 2025 | 03:06 AM

రాష్ట్రాభివృద్ధి లక్ష్య సాధనలో భాగస్వామి కావాలని యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ను ఏపీ విద్య, ఐటీ-ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి లోకేశ్‌ అభ్యర్థించారు.

Minister Lokesh: క్వాంటమ్‌ రిసెర్చ్‌లో భాగస్వాములవ్వండి

  • వర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌కు లోకేశ్‌ అభ్యర్థన

  • రాష్ట్రాభివృద్ధి లక్ష్యాల సాధనకు సహకరించండి

  • ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, ఐవోటీల్లో నైపుణ్యాభివృద్ధికి తోడ్పడండి

  • స్మార్ట్‌ సిటీ ప్లానింగ్‌, వ్యర్థాల నిర్వహణ టెక్నాలజీ పంచండి

  • విక్టోరియా క్రీడల మంత్రితోనూ భేటీ.. క్రికెట్‌, హాకీల్లో ఉమ్మడి శిక్షణ శిబిరాలు, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించాలని వినతి

  • టాస్మేనియా వర్సిటీ సందర్శన.. లేసా ఆసియా పసిఫిక్‌ సీవోవోతో భేటీ

అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధి లక్ష్య సాధనలో భాగస్వామి కావాలని యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ను ఏపీ విద్య, ఐటీ-ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి లోకేశ్‌ అభ్యర్థించారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదో రోజు గురువారం ఆయన వివిధ వర్సిటీలు, సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. తొలుత మెల్‌బోర్న్‌ వర్సిటీని సందర్శించారు. వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎమ్మా జాన్‌స్టన్‌, డిప్యూటీ వైస్‌ చాన్స్‌లర్‌ (గ్లోబల్‌, కల్చర్‌-ఎంగేజ్‌మెంట్‌) ప్రొఫెసర్‌ మైకేల్‌ వెస్లీ, డీన్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ప్రొఫెసర్‌ జెన్నిఫర్‌ బలింత్‌, డీన్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌ మారెక్‌ తెసర్‌, డీన్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌-ఐటీ ప్రొఫెసర్‌ నిర్మల్‌దాస్‌, డీన్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ మొయిరా ఓబ్రియాన్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. క్వాంటమ్‌ పరిశోధనలు, ఉపాధ్యాయ శిక్షణపై లోకేశ్‌ వారితో చర్చించారు. ఏపీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో కలసి కృత్రిమ మేధ (ఏఐ), సైబర్‌ సెక్యూరిటీ , ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) వంటి అధునాతన సాంకేతికతల్లో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు, పాఠ్యాంశాలు రూపొందించాలని ఆయన కోరారు. ‘రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న క్వాంటమ్‌ రీసెర్చ్‌లో భాగస్వాములవండి. పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయ, ఆరోగ్య రంగాల్లో సలహాలు, సూచనలు చేస్తూ మార్గనిర్దేశం చేయండి. రాష్ట్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో సహకరించండి. పంట దిగుబడులు పెరిగేలా నీటి నిర్వహణ, సుస్థిర వ్యవసాయ విధానాలు మెరుగుపరచడంలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలసి పరస్పరం సహరించుకునేలా కార్యచరణ రూపొందించాలి. స్థానిక సంస్థలను భాగస్వామలను చేసి డిజిటల్‌ హెల్త్‌ సొల్యూషన్‌, టెలి-మెడిసన్‌ ద్వారా ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు మెల్‌బోర్న్‌ వర్సిటీ సహకారాన్ని అర్థిస్తున్నాం. స్మార్ట్‌ సిటీ ప్లానింగ్‌, వ్యర్థ నిర్వహణ, పునరుత్పాదక విద్యుత్‌ రంగాల్లో నైపుణ్యాలను పంచి రాష్ట్రాభివృదిఽ్ధకి మద్దతుగా నిలవండి’ అని కోరారు.


హెరిటేజ్‌ టూరిజం అభివృద్ధికి సహకరించండి

ఏపీలో హెరిటేజ్‌ టూరిజం అభివృద్ధికి సహకరించాలని విక్టోరియా రాష్ట్ర పర్యావరణ, పర్యాటక, స్పోర్ట్స్‌ శాఖల మంత్రి స్టీవ్‌ డిమోపౌలోస్‌ను లోకేశ్‌ కోరారు. క్రికెట్‌, హాకీల్లో ఉమ్మడి శిక్షణా శిబిరాలు, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నూతన ఆలోచనలను అందించాలని కోరారు. వారసత్వ పర్యాటకానికి విక్టోరియా ప్రసిద్ధి చెందిందని.. తమ రాష్ట్రంలోనూ పాపికొండలు, విశాఖ బీచ్‌ వంటి సుందర ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయని లోకేశ్‌ వివరించారు. ఈ ప్రాంతాల్లో పర్యటించి టెంపుల్‌ టూరిజం, వారసత్వ టూరిజం అభివృద్ధికి తగిన సలహాలూ సూచనలూ చేయాలని కోరారు. గ్రేట్‌ ఓషన్‌ రోడ్‌ తరహా పర్యావరణ బ్రాండింగ్‌కు విక్టోరియా నమూనాగా నిలించిందని.. ఈ నైపుణ్యాన్ని తమకూ అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖతో కలసి హెరిటేజ్‌ టూరిజం, మార్కెటింగ్‌, ఎకో సర్టిఫికేషన్‌పై కలసి పనిచేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రానికి 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉందని, విక్టోరియా పోర్ట్‌ ఫిలిప్‌ బే ప్రాజెక్టు తరహాలో వాతావరణ సాంకేతికతను ఉపయోగించి ఏపీ తీరప్రాంత అభివృద్ధిపై ఉమ్మడి పరిశోధన- అభివృద్ధి, కార్యాచరణ చేపట్టాలని డిమోపౌలోస్‌ను కోరారు. విక్టోరియా సర్క్యులర్‌ ఎకానమీకి చేయూతనిస్తున్న వ్యర్థాల నిర్వహణ, కార్బన్‌ న్యూట్రల్‌ టూరిజం తరహాలో రాష్ట్రంలోనూ అంతర్జాతీయ కార్యకలాపాలు చేపట్టేలా సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఆంధ్రప్రదేశ్‌, విక్టోరియాల్లో క్రికెట్‌, హాకీ వంటి క్రీడలకు చెందిన ఉమ్మడి శిక్షణ శిబిరాలు, స్నేహపూర్వక మ్యాచ్‌లను నిర్వహించాలని అభ్యర్థించారు. పరస్పర సహకారఃథక్ష స్పోర్ట్స్‌ సైన్స్‌ను అమలు చేయాలన్నారు. విక్టోరియా అడ్వెంచర్‌ టూరిజంను రాష్ట్రానికి పరిచయం చేయాలని.. టూరిజం గవర్నెన్స్‌ తరహాలో అరకులో ట్రెక్కింగ్‌, పులికాట్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌ అభివృద్ధి చేయాలని కోరారు. విక్టోరియా సంస్థల ద్వారా అడ్వెంచర్‌ గైడ్స్‌, రేంజర్ల సర్టిఫికేషన్స్‌, నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించాలని ప్రతిపాదించారు. విక్టోరియా ఆఫ్‌షోర్‌ విండ్‌, సోలార్‌ రెన్యువల్‌ ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో యువతకు గ్రీన్‌ లాబ్స్‌ డెవల్‌పమెంట్‌ కార్యక్రమాల్లో సహకారం అందించాలని కోరారు.


ఫార్మసీ, పారామెడికల్‌ కోర్సుల్లో పాఠ్యాంశాలు..

యూనివర్సిటీ ఆఫ్‌ టాస్మేనియాను కూడా గురువారం లోకేశ్‌ సందర్శించారు. వర్సిటీ డిప్యూటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సలాలీ బ్రౌన్‌, స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ అండ్‌ ఫార్మకాలజీ హెడ్‌ గైన్‌ జాకల్పన్‌తో చర్చలు జరిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్ట్రేలియాలో అమలు చేస్తున్న కఠిన అక్రిడిటేషన్‌ వ్యవస్థల తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫార్మసీ, పారామెడికల్‌ కోర్సుల్లో పాఠ్య ప్రణాళిక అభివృద్ధికి సహకరించాలని లోకేశ్‌ కోరారు. ‘ఈ కోర్సులకు సంబంధించిన శిక్షణలో డిజిటల్‌ హెల్త్‌ టూల్స్‌ (ఏఐ)ను అనుసంధించాలి. ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కళాశాలలు, స్కిల్‌ వర్సిటీకి, ఫార్మా/హెల్త్‌కేర్‌ నెట్‌వర్క్‌ను అందించే పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించండి. ఉమ్మడి పరిశోధనలు చేపట్టేందుకు సహకరించండి. ఏపీలోని నర్సింగ్‌, ఫార్మసీ విద్యార్థుల కోసం స్టూడెంట్‌/ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్‌ కార్యక్రమాలు చేపట్టాలి. ఆస్ట్రేలియా అర్హతలకు అనుగుణంగా ఏపీ ఫార్మసీ విద్యార్థుల స్కిల్‌ సర్టిఫికెట్‌ను బెంచ్‌మార్క్‌ చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Oct 24 , 2025 | 03:08 AM