Minister Lokesh: మంగళగిరి ఆడబిడ్డలకు రుణపడి ఉంటా
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:40 AM
నాకు అక్కలు, చెల్లెళ్లు లేరు. మంగళగిరి మహిళలే నా అక్కాచెల్లెళ్లు. ఈ రోజు మీరంతా రాఖీ కట్టి అందించిన ఆశీస్సులు కొండంత బలాన్ని ఇచ్చాయి.
ఇప్పటికి 3 వేల మందికి పట్టాలిచ్చాం
రాష్ట్రంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దుతా: లోకేశ్
రాఖీలు కట్టడానికి భారీగా తరలివచ్చిన స్థానిక మహిళలు
అమరావతి, మంగళగిరి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ‘నాకు అక్కలు, చెల్లెళ్లు లేరు. మంగళగిరి మహిళలే నా అక్కాచెల్లెళ్లు. ఈ రోజు మీరంతా రాఖీ కట్టి అందించిన ఆశీస్సులు కొండంత బలాన్ని ఇచ్చాయి. మీ ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు శనివారం ఉండవల్లి నివాసానికి వచ్చి మంత్రి లోకేశ్‌కు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు. మంత్రి మాట్లాడుతూ... ‘గత ఏడాది ఎన్నికల్లో మంగళగిరి నుంచే రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద మెజారిటీతో గెలిపించి విమర్శించిన వారి నోళ్లు మూయించారు. తొలి ఏడాదిలోనే సుమారు 3 వేల మందికిపైగా పట్టాలు ఇచ్చి రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తిని పంపిణీ చేసి మాట నిలబెట్టుకున్నా. నియోజకవర్గంలో 200 అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాను. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.