Share News

Minister Lokesh: నేటి ఉదయం 9కి సంచలనం

ABN , Publish Date - Nov 13 , 2025 | 06:04 AM

రాష్ట్రానికి మరో భారీ కంపెనీ రాబోతోందా.. ఇప్పటికే ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపులు ఫలించాయా..

Minister Lokesh: నేటి ఉదయం 9కి సంచలనం

  • భారీ పెట్టుబడిపై ఆసక్తి రేపిన మంత్రి లోకేశ్‌ పోస్టు

  • 2019 నుంచి కొత్త ప్రాజెక్టులు చేపట్టని సంస్థ తుఫానులా రాష్ట్రానికి తిరిగి వస్తోంది

అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మరో భారీ కంపెనీ రాబోతోందా? ఇప్పటికే ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపులు ఫలించాయా? ఇలాంటి సందేహాలు రేకెత్తించేలా ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ ప్రత్యేకంగా ఎక్స్‌లో బుధవారం పోస్టు చేశారు. గొప్ప ఆవిష్కరణ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ‘‘2019 నుంచి కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఆ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రేపు (గురువారం) తుఫానులా రాష్ట్రానికి తిరిగివస్తోంది. ఎవరది?? ఉదయం 9 గంటలకు పెద్ద ప్రకటన ఉంటుంది. వేచి చూడండి’’ అంటూ లోకేశ్‌ ఆ పోస్టులో పేర్కొన్నారు. లోకేశ్‌ పోస్టు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

Updated Date - Nov 13 , 2025 | 06:05 AM