Share News

Minister Lokesh Meets Sachin Tendulkar : టెండూల్కర్‌ను కలిసిన మంత్రి లోకేశ్‌

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:37 AM

సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు టీం ఇండియా మాజీ కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్‌, నటి ఐశ్వర్యా రాయ్‌, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌....

Minister Lokesh Meets Sachin Tendulkar : టెండూల్కర్‌ను కలిసిన మంత్రి లోకేశ్‌

  • మహా సమాధిని దర్శించుకున్న ఐశ్వర్యారాయ్‌

పుట్టపర్తి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు టీం ఇండియా మాజీ కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్‌, నటి ఐశ్వర్యా రాయ్‌, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పుట్టపర్తికి చేరుకున్నారు. అలాగే మంత్రులు లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌ మంగళవారం సాయంత్రం పుట్టపర్తికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో సచిన్‌ టెండూల్కర్‌ను లోకేశ్‌, మంత్రులు కలిసి.. కాసేపు ముచ్చటించారు. మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణను మంత్రులు లోకేశ్‌, పయ్యావుల, అనగాని మర్యాదపూర్వకంగా కలిశారు. నటి ఐశ్వర్యా రాయ్‌ సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు

Updated Date - Nov 19 , 2025 | 05:37 AM