Share News

Minister Lokesh: ప్రభుత్వ బడులకు లక్ష నోటు పుస్తకాలు, పెన్నులు

ABN , Publish Date - Oct 01 , 2025 | 05:12 AM

డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్‌ పథకంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌ఎస్ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ కంపెనీ..

Minister Lokesh: ప్రభుత్వ బడులకు లక్ష నోటు పుస్తకాలు, పెన్నులు

  • కేఎల్‌ఎస్ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థ విరాళం

  • పంపిణీని ప్రారంభించిన మంత్రి లోకేశ్‌

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్‌ పథకంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌ఎస్ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ కంపెనీ దాదాపు రూ.40 లక్షల విలువైన లక్ష నోటు పుస్తకాలు, పెన్నులను విరాళంగా అందజేసింది. పుస్తకాలు, పెన్నులను తీసుకొచ్చిన లారీకి విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ మంగళవారం జెండా ఊపి.. వాటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్‌, కేఎల్‌ఎ్‌సఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థ ఎండీ కేఎల్‌ శ్రీధర్‌రెడ్డి, డైరెక్టర్‌ కె.ప్రీతమ్‌రెడ్డి, సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టరు బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2025 | 05:13 AM