Australian Government: స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్‌కు రండి
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:57 AM
రాష్ట్ర విద్యారంగంలో సంస్కరణల ద్వారా ‘మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’కు శ్రీకారంచుట్టిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ....
మంత్రి లోకేశ్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానం
2001లో మోదీ పాల్గొన్నట్టు వెల్లడి
అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యారంగంలో సంస్కరణల ద్వారా ‘మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’కు శ్రీకారంచుట్టిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ (ఎ్‌సవీపీ)లో పాల్గొనాలని లోకేశ్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఈమేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన లేఖను పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో మంత్రి లోకేశ్ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మేరకు ఎస్‌వీపీలో భాగస్వామ్యం కావాలని కోరింది. గత 20ఏళ్లలో దేశంలోని ప్రముఖ రాజకీయనాయకులు తమదేశానికి వచ్చారని, 2001లో ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ఎస్‌వీపీలో భాగస్వాములయ్యారని పేర్కొంది. ఎస్‌వీపీ ద్వారా ఆస్ట్రేలియాలోని రాజకీయనేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాసభారతీయులతో సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపింది.