Minister Lokesh: అవ్వా.. మన ప్రభుత్వ పాలన బాగుందా?
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:00 AM
సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు పుట్ట పర్తికి విచ్చేసిన మంత్రి లోకేశ్.. తన శిబిరం వద్దకు వచ్చిన వారితో ముచ్చటించి, వారి సమస్యలు తెలుసుకున్నారు.
పింఛన్ డబ్బు సకాలంలో అందుతుందా?
ఓ వృద్ధురాలికి మంత్రి లోకేశ్ ఆప్యాయ పలకరింపు
కొత్తచెరువు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు పుట్ట పర్తికి విచ్చేసిన మంత్రి లోకేశ్.. తన శిబిరం వద్దకు వచ్చిన వారితో ముచ్చటించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. పుట్టపర్తి సమీ పంలోని మామిళ్లకుంట క్రాస్ వద్ద గల పారిశ్రామిక వాడలో మంత్రికి విడిది కేంద్రం ఏర్పాటు చేశారు. ఆదివారం లోకేశ్‌ను కలిసి, సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజలు బారులుతీరారు. మంత్రి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు విన్నారు. తనను కలిసిన ఓ వృద్ధు రాలితో ఆప్యాయంగా మాట్లాడారు. ‘అవ్వా.. ఆరోగ్యం బాగుందా.. మన ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది.. నీకు పింఛన్ డబ్బు సకాలంలో ఇస్తున్నారా?’ అని ఆరా తీశారు. వైసీపీ హ యాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, ఇబ్బందులు పెట్టారని పలువురు తమ సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు.