Share News

Delhi Visit: ఢిల్లీలో మంత్రి లోకేశ్‌.. నేడు ప్రధాని మోదీతో భేటీ

ABN , Publish Date - Sep 05 , 2025 | 05:37 AM

మంత్రి నారా లోకేశ్‌ గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు.

Delhi Visit: ఢిల్లీలో మంత్రి లోకేశ్‌.. నేడు ప్రధాని మోదీతో భేటీ
Minister Nara Lokesh

అమరావతి/న్యూఢిల్లీ, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): మంత్రి నారా లోకేశ్‌ గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఈ ఏడాది ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ ప్రధాన కార్యక్రమం విశాఖపట్నలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమ నిర్వహణ ప్రణాళికతోపాటు, యోగాకు అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం కల్పించడంపై సిద్ధం చేసిన నివేదిక (టేబుల్‌ బుక్‌)ను ప్రధానికి లోకేశ్‌ అందిస్తారు. కాగా, పుస్తకాలు, మ్యాప్‌లు, చార్టులు, పెన్సిళ్లు తదితరాలపై జీఎస్టీ తగ్గింపును స్వాగతిస్తున్నానని లోకేశ్‌ తెలిపారు.

Updated Date - Sep 05 , 2025 | 07:39 AM