సమానత్వమే సాయితత్వం: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:24 AM
ప్రేమ, అహింస, సత్యం, ధర్మం, శాంతి ప్రతి మనిషి జీవిత పరమార్థమని సత్యసాయి బోధించారు.
అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రేమ, అహింస, సత్యం, ధర్మం, శాంతి ప్రతి మనిషి జీవిత పరమార్థమని సత్యసాయి బోధించారు. ప్రేమ తత్వమే మానవత్వం.. సమానత్వమే సాయితత్వమని చాటిచెప్పిన బాబా పుట్టిన ఈ రాష్ట్రంలో నేను పుట్టడం పూర్వజన్మ సుకృతం. భగవాన్ శతజయంత్యుత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం. విద్య, వైద్య, ప్రజా అవసరాలు తీరుస్తూ సేవా భావమే దైవత్వమని ఆయన నిరూపించారు. భగవాన్ చూపిన మార్గంలో పయనిస్తూ, ప్రజాసేవకు అంకితమైన కోట్లాది మంది భక్తులు ఆయనకు ప్రతిరూపాలు. బాబా శతజయంతి సందర్భంగా వారందరికీ నా శుభాకాంక్షలు.