Minister Lokesh statement: విధ్వంస పాలనపై ప్రజా ఆకాంక్షల విజయం
ABN , Publish Date - Jun 05 , 2025 | 06:25 AM
చంద్రబాబు పాలనానుభవం, పవనన్న ఆశయానికి మోదీ ఆశీస్సులు పుష్కలంగా లభించడంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ప్రారంభమైంది. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఐదు కోట్ల మంది ప్రజలకు కృతజ్ఞతలు.
అమరావతి, జూన్ 4(ఆంధ్రజ్యోతి): మంత్రి లోకేశ్ ఎక్స్‌లో స్పందిస్తూ... ‘సరిగ్గా సంవత్సరం క్రితం విధ్వంస పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయి. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు. చంద్రబాబు పాలనానుభవం, పవనన్న ఆశయానికి మోదీ ఆశీస్సులు పుష్కలంగా లభించడంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ప్రారంభమైంది. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఐదు కోట్ల మంది ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఇదే స్ఫూర్తితో మాకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. ప్రజాతీర్పు దినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.