Share News

Minister Lokesh: ఆస్ట్రేలియాకు మంత్రి లోకేశ్‌

ABN , Publish Date - Oct 19 , 2025 | 03:01 AM

రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదివారం నుంచి శుక్రవారం...

Minister Lokesh: ఆస్ట్రేలియాకు మంత్రి లోకేశ్‌

  • నేటి నుంచి 24 వరకు పర్యటన

  • వర్సిటీల్లో అధునాతన బోధనపై అధ్యయనం

  • సీఫుడ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఆస్ట్రేలియా ప్రతినిధులతో భేటీ

  • సీఐఐ భాగస్వామ్య సదస్సుపై రోడ్‌షో నిర్వహణ

అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదివారం నుంచి శుక్రవారం(ఈనెల 24) వరకు అస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్‌ విజిట్స్‌ ప్రోగ్రామ్‌(ఎ్‌సవీపీ)లో పాల్గొనాల్సిందిగా అస్ట్రేలియా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు లోకేశ్‌ ఈ పర్యటనకు వెళ్తున్నారు. మానవ వనరులు, సాంకేతికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా.. మంత్రి లోకేశ్‌ను ప్రత్యేక పర్యటనకు ఆహ్వానించింది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాలను సందర్శించి అక్కడి అధునాతన విద్యాబోధనపై అధ్యయనం చేస్తారు. అదేవిధంగా వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో పాల్గొనాలని అక్కడి ప్రముఖ పారిశ్రామిక సంస్థలను కోరనున్నారు. అదేవిధంగా రోడ్‌షోలోనూ పాల్గొంటారు.

పర్యటన షెడ్యూల్‌ ఇలా..

19న: ఉదయం 11.30కు సిడ్నీ చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్స్‌ ఆవరణలో తెలుగు డయాస్పోరాలో పాల్గొంటారు.

20న: ఉదయం 9 గంటలకు రాండ్విక్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూసౌత్‌వేల్స్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బిజినెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో న్యూసౌత్‌ వేల్స్‌ ఎంపీలు, వ్యాపార ప్రతినిధులతో సమావేశమవుతారు. సాయంత్రం 3కు అస్ట్రేలియా స్కూల్‌ అండ్‌ ట్రైనింగ్‌ మంత్రి ఆండ్రూగిల్స్‌తో కలసి టాఫే ఎన్‌ఎ్‌సడబ్ల్యూ అల్టిమో క్యాంప్‌సను సందర్శిస్తారు. 6.30కు ఎన్‌ఎ్‌సడబ్ల్యూ పార్లమెంట్‌ హౌస్‌ ఆవరణలో ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో కలసి రోడ్‌షోలో పాల్గొంటారు.

21న: ఉదయం 8.30కు పర్రమట్టలో సీఫుడ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఆస్ట్రేలియా నిర్వహించే ఆక్వా ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 11కు వెస్ట్రన్‌ సడ్నీ వర్సిటీకి వెళ్తారు. ఈ వర్సిటీలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, వ్యవసాయ సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు. 2 గంటలకు న్యూసౌత్‌వేల్స్‌ ఇన్నోవేషన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి అనోలాక్‌ చాంధివోంగ్‌తో భేటీ అవుతారు.


22న: ఉదయం 9 గంటలకు గోల్డ్‌ కోస్ట్‌ సౌత్‌ పోర్టులోని గ్రఫీత్‌ వర్సిటీకి వెళతారు. మధ్యాహ్నం 2కు బ్రిస్పేన్‌లో క్వీన్స్‌లాండ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3కు క్వీన్స్‌లాండ్‌ మంత్రితో సమావేశమవుతారు. సాయంత్రం 4కు రాష్ట్రంలో అధునాతన స్పోర్ట్స్‌ స్టేడియం నిర్మాణంపై ఆర్కిటెక్‌ లీడర్‌షిప్‌ టీమ్‌తో భేటీ అవుతారు.

23న: ఉదయం 9.30కు వర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌కు వెళతారు. మధ్యాహ్నం 2కు విక్టోరియా స్కిల్స్‌ మినిస్టర్‌ బెన్‌ కరోల్‌ను కలుస్తారు. సాయంత్రం 4.30కు యర్రావ్యాలీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైన్‌ ఇండస్ట్రీని, ట్రైజరీ వైన్స్‌ ఎస్టేట్‌ను పరిశీలిస్తారు.

24న: ఉదయం 9 గంటలకు మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా వాణిజ్య, పెట్టుబడుల కమిషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విద్యపై ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో లోకేశ్‌ పాల్గొంటారు. ఉదయం 11.30కు మెల్‌బోర్న్‌ గ్రాండ్‌ హయ్యత్‌ హోటల్‌లో ఏఐబీసీ ఆధ్వర్యంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్‌షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు విక్టోరియా క్రికెట్‌ గ్రౌండ్‌లో స్పోర్ట్స్‌ టెక్నాలజీ, మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. రాత్రి మెల్‌బోర్న్‌లో బయలుదేరి 25న హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Updated Date - Oct 19 , 2025 | 03:01 AM