Share News

Minister Lokesh: చిట్టి తల్లీ నిశ్చింతగా చదువుకో

ABN , Publish Date - Sep 22 , 2025 | 04:40 AM

కేజీబీవీలో సీటు రాకపోవడంతో పొలం పనులకు వెళుతున్న జెస్సీ కథనాన్ని ఆంధ్రజ్యోతిలో చదివి తాను చలించిపోయానని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు.

Minister Lokesh: చిట్టి తల్లీ నిశ్చింతగా చదువుకో

  • నీ చదువుకు నేను భరోసా.. కేజీబీవీలో సీటు బాధ్యత నాది

  • ‘ఆంధ్రజ్యోతి’ జెస్సీ కథనంపై మంత్రి లోకేశ్‌ స్పందన

అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): కేజీబీవీలో సీటు రాకపోవడంతో పొలం పనులకు వెళుతున్న జెస్సీ కథనాన్ని ‘ఆంధ్రజ్యోతి’లో చదివి తాను చలించిపోయానని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. మంత్రాలయం మండలం బూదురుకు చెందిన జెస్సీ చదువుల కలను వెలుగులోకి తీసుకొచ్చిన ‘ఆంధ్రజ్యోతి’కి అభినందనలు తెలిపారు. ‘‘అధికారులతో మాట్లాడాను. చిట్టి తల్లీ.. కేజీబీవీలో నీకు సీటు వస్తుంది. నిశ్చింతగా చదువుకో.’’ అని జెస్సీకి భరోసా ఇచ్చారు. పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరమని, తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపితే ‘తల్లికి వందనం’ వస్తుందని తెలిపారు. చక్కటి యూనిఫాం, పుస్తకాలు, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్టు ఇస్తున్నామని, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నామని పేర్కొన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పిల్లల భద్రత-భవితకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం మరొకటి లేదన్నారు. విద్యకు పిల్లలను దూరం చేయొద్దని తల్లిదండ్రులకు లోకేశ్‌ విన్నవించారు.

Updated Date - Sep 22 , 2025 | 04:42 AM