Minister Kondapalli Srinivas: ఏపీలో పెట్టుబడులు పెట్టండి
ABN , Publish Date - Oct 17 , 2025 | 06:11 AM
రాష్ట్రానికి పెట్టుబడులతోపాటు సాంకేతిక సహకారం, నూతన ఆవిష్కరణల భాగస్వామ్యాలను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్...
స్విట్జర్లాండ్‌లో వస్త్ర పరిశ్రమ ప్రముఖులతో మంత్రి కొండపల్లి సమావేశం
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడులతోపాటు సాంకేతిక సహకారం, నూతన ఆవిష్కరణల భాగస్వామ్యాలను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్విట్జర్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటిస్తున్నారు. గురువారం ఆయన స్విట్జర్లాండ్‌లో అత్యంత నాణ్యతతో వస్త్ర ఉత్పత్తుల తయారీలో అంతర్జాతీయంగా పేరున్న ఒలివర్ సంస్థ ప్రతినిధులు, ఇతర వస్త్ర పరిశ్రమ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి వివరించారు. భారత్‌లో తమ యూనిట్‌ను స్థాపించడానికి ఒలివర్ కంపెనీ ఆసక్తి వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. జర్మనీకి చెందిన ఫైర్స్‌ట్‌జెన్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ఫిలిప్ ఆస్మస్, ఎక్స్‌పోర్ట్ అకాడమీ బాడెన్-వుర్టెన్ బర్గ్ ప్రతినిధులతోనూ కొండపల్లి చర్చలు జరిపారు.