Share News

Minister Kondapalli Srinivas: పారిశ్రామికవేత్తలకు సహకరిస్తాం

ABN , Publish Date - Dec 04 , 2025 | 05:45 AM

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పునరుద్ఘాటించారు.

Minister Kondapalli Srinivas: పారిశ్రామికవేత్తలకు సహకరిస్తాం

  • ‘ఇండస్‌’ ప్రతినిధులతో భేటీలో మంత్రి కొండపల్లి

అమరావతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పునరుద్ఘాటించారు. రాష్ట్ర సచివాలయంలో ది ఇండస్‌ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ (టీఐఈ) ప్రతినిధులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండస్‌ ప్రతినిధులు తమ మెంటార్‌షిప్‌ ఫ్రేమ్‌వర్క్‌ గురించి మంత్రికి, అధికారులకు వివరించారు. కాగా, వచ్చే ఏడాది జనవరి 4న జైపూర్‌లో జరగనున్న టీఐఈ గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా మంత్రిని వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి.. పీ4 విధానం, రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అందిస్తున్న సహకారం గురించిఇండస్‌ ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో టీఐఈ ప్రతినిధులు మురళి, విజయ్‌ మేనన్‌, మహావీర్‌ ప్రతా్‌పశర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 05:46 AM