Minister Kondapalli Srinivas: యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:00 AM
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
175 నియోజకవర్గాల్లో ఎంఎ్‌సఎంఈ పార్కులు: మంత్రి కొండపల్లి
విశాఖపట్నం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం ఫిక్కీ సెంటర్ ఫర్ సస్టైనబులిటీ లీడర్‌షిప్, విశాఖపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ర్టీస్ (వీసీసీఐ) సంయుక్తంగా ‘పర్యావరణ, సామాజిక పాలన (ఈఎస్‌జీ) సూత్రాలు, ఎంఎస్ఎంఈల సుస్థిర వృద్ధి’ అనే అంశంపై అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ... ‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించనున్నాం. ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రోత్సాహక అధికారులను నియమిస్తున్నాం. జిల్లాల స్థాయిలో చాంబర్ ఆఫ్ కామర్స్‌లు ఏర్పాటు చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది’ అని పేర్కొన్నారు. ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివ శంకరరావు మాట్లాడుతూ... ‘నాణ్యత, నిబంధనల లోపాలతో భారతీయ ఎగుమతులు అంతర్జాతీయ మార్కెట్‌లో తిరస్కరణకు గురైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి, ఎంఎస్ఎంఈలు సుస్థిర విధానాలను అవలంభించడం అవసరం’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీసీసీఐ అధ్యక్షుడు సుదర్శనస్వామి, కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ కె.శివరామ్‌ప్రసాద్, సెంట్రల్ బ్యాంక్ డీజీఎం ఏవీ రమణమూర్తి, జేఎ్‌సడబ్ల్యు పారిశ్రామిక పార్క్, బిజినెస్ ఆఫీసర్ రాజారాం పాయ్ తదితరులు పాల్గొన్నారు.