అన్నదాతలపై వైసీపీ మొసలికన్నీరు: మంత్రి కొలుసు
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:22 AM
యూరియా విషయంలో వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తూ రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తోంది అని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు.
అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘యూరియా విషయంలో వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తూ రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తోంది’ అని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వ్యవసాయాన్ని నాశనం చేసిన జగన్ నేడు అన్నదాత పోరు పేరుతో కొత్త డ్రామాకు తెరదీశారు. మొసలి కన్నీరు కారుస్తున్నారు. దమ్ముంటే వ్యవసాయం, నీటిపారుదల అంశాలపై వైసీపీ చర్చకు రావాలి. కూటమికి మంచి పేరు వస్తుందనే వైసీపీ విషప్రచారానికి సిద్ధమైంది’ అని మంత్రి పార్థసారథి విమర్శించారు.