సమాజాన్ని నాశనం చేసేవారికి జగన్ దన్ను: కొల్లు
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:08 AM
సమాజాన్ని సర్వనాశనం చేసే వ్యక్తులను జగన్ వెనకేసుకురావడం ఏమిటని మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు.
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): సమాజాన్ని సర్వనాశనం చేసే వ్యక్తులను జగన్ వెనకేసుకురావడం ఏమిటని మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు. ఆఖరి గంజాయితో దొరికిన వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నరరూప రాక్షసుడులాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని దేవతామూర్తిగా చూపించాలని చూస్తున్నారా.. జోగి రమేశ్ లాంటి వ్యక్తులను అద్భుతమైన వ్యక్తులుగా చూపించాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. పరకామణి కేసులో వేంకటేశ్వరస్వామి హుండీ డబ్బులు కొట్టేసిన వారిని వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు.