Minister Kollu Ravindra: అన్ని జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలకు భవనాలు
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:07 AM
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలకు భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.
మంత్రి కొల్లు రవీంద్ర
ఒంగోలు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలకు భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో రూ.2.14 కోట్లతో నిర్మించనున్న గనుల శాఖ కార్యాలయానికి ఆదివారం ఆయన మంత్రి డాక్టర్ డీఎ్‌సబీవీ స్వామితో కలిసి శంకుస్థాపన చేశారు. గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొంటున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర ఈసందర్భంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా మైనింగ్ పాలసీని అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్‌కుమార్, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.