విద్వేషాలు రెచ్చగొట్టడమే జగన్ అజెండా: మంత్రి కొల్లు
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:32 AM
దిగజారుడు రాజకీయాలకు వైసీపీ చిరునామాగా మారిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): దిగజారుడు రాజకీయాలకు వైసీపీ చిరునామాగా మారిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. సొంత బాబాయ్ హత్య జరిగితే దానిని నారాసుర రక్త చరిత్ర అని సీఎం చంద్రబాబు మీదకు నెట్టడానికి ప్రయత్నించారని, తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తే బాబాయ్ కూతురు సునీత, ఆమె భర్త మీదకు నెట్టేశారన్నారు. సొంత చెల్లి గురించీ సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెట్టించారని విమర్శించారు. జగన్ కంటే నీచమైన వ్యక్తులు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరని అన్నారు.