Share News

Minister Kandula Durgesh: సంక్షేమ పథకాలు అమలు కావడం లేదా?

ABN , Publish Date - Dec 05 , 2025 | 04:07 AM

వైసీపీ అధినే త జగన్‌ రెండు నెలలకోసారి తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చి రెండు, మూడు గంటలు మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వంపై తన అక్కసు వెళ్లగక్కుతున్నారని రాష్ట్ర పర్యాటకశాఖ...

Minister Kandula Durgesh: సంక్షేమ పథకాలు అమలు కావడం లేదా?

  • బయటికి వచ్చి వాస్తవాలు తెలుసుకో జగన్‌: కందుల దుర్గేశ్‌

అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినే త జగన్‌ రెండు నెలలకోసారి తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చి రెండు, మూడు గంటలు మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వంపై తన అక్కసు వెళ్లగక్కుతున్నారని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ మండిపడ్డారు. తన ఉనికి కాపాడుకోవాలనే తాపత్రయంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అమరావతి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జగన్‌ బయటకి వచ్చి వాస్తవాలు తెలుసుకోండి.. బయటకి వచ్చినా మీకు వినిపించడం లేదంటే మీకు వినికిడి సమస్య అయినా ఉండాలి.. కంటి చూపైనా మందగించి ఉండాలి. లేదా.. వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే తాము ఏం చేశామో గణాంకాలు ఇస్తామ’ని మంత్రి జగన్‌పై మండిపడ్డారు. పవన్‌ను మాంత్రికుడని వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యానించడం దారుణమని, మాంత్రికుడి వేషం వేసేదే ఆయన అని దుర్గేశ్‌ విమర్శించారు. వ్యక్తిగతంగా కించపరచడమే వైసీపీ సంస్కృతి అని మండిపడ్డారు.

Updated Date - Dec 05 , 2025 | 04:07 AM