Minister Kandula Durgesh: పర్యాటకంలో 98 సంస్థలతో ఒప్పందాలు
ABN , Publish Date - Nov 14 , 2025 | 05:26 AM
పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా, నూతన పర్యాటక పాలసీ 2024-29తో పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు.
ఇప్పటి వరకు రూ.12వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి దుర్గేశ్
విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా, నూతన పర్యాటక పాలసీ 2024-29తో పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. ఇందులో భాగంగా విశాఖలో జరుగుతున్న పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో, ఒక్క పర్యాటక రంగంలోనే 98 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు వెల్లడించారు. సదస్సులో పాల్గొనడానికి గురువారం విశాఖపట్నం వచ్చిన ఆయన గ్రీన్‌పార్క్ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులు పెట్టి ఔత్సాహికులను ఆహ్వానించామన్నారు. ఇప్పటివరకూ సుమారు రూ.12వేల కోట్ల విలువైన పెట్టుబడులు సాధించినట్లు తెలిపారు. సముద్రతీరాన వెల్‌నెస్ సెంటర్లు, ఎకో టూరిజం పార్కుల ఏర్పాటు అంశాల్లో సమూల మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. మెగా, ఆలా్ట్ర మెగా ప్రాజెక్టులతో స్టార్ హోటళ్లు రానున్నాయని మంత్రి తెలిపారు.