Share News

Dornipadu: మానవత్వం చాటుకున్న మంత్రి జనార్దన్‌ రెడ్డి

ABN , Publish Date - Aug 01 , 2025 | 04:32 AM

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని రక్షించి వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మానవత్వం చాటుకున్నారు.

Dornipadu: మానవత్వం చాటుకున్న మంత్రి జనార్దన్‌ రెడ్డి

దొర్నిపాడు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని రక్షించి వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మానవత్వం చాటుకున్నారు. గురువారం నంద్యాల జిల్లా దొర్నిపాడులో జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న పడకండ్ల గ్రామానికి చెందిన ఓబులేసు అనే యువకుడు ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి వెంటనే కారు దిగి, తీవ్రంగా గాయపడ్డ ఓబులేసును తన సిబ్బంది సహాయంతో ఓ వాహనంలో ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Updated Date - Aug 01 , 2025 | 04:33 AM