Minister Gollapalli Ravi Kumar: విద్యుత్తు ప్రాజెక్టు పనులు వేగవంతం
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:35 AM
రాష్ట్రం లో పెద్ద ఎత్తున జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధికి బాసటగా విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు...
పారిశ్రామికాభివృద్ధికి బాసటగా చర్యలు
విద్యుత్ సమీక్షలో మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో పెద్ద ఎత్తున జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధికి బాసటగా విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ట్రాన్స్‌కో, ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కొత్త పరిశ్రమల స్థాపన, తయారీ యూనిట్ల విస్తరణ, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్, భవిష్యత్తు విద్యుత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తు విద్యుత్తు లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన, నిరంతర విద్యుత్తు సరఫరా చేసేందుకు విద్యుత్తు సంస్థలు సిద్ధం కావాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఉండేందుకు 132 కేవీ, 220 కేవీ, 400 కేవీ సామర్థ్యాలతో 29 కొత్త సబ్‌స్టేషన్లను నెలకొల్పాలని నిర్ణయించామని అధికారులకు తెలిపారు. గృహ, వ్యవసాయ వినియోగదారులకు అందించే సేవలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వీటి కనెక్షన్ల విషయంలో ఫిర్యాదుల్లేకుండా చూడాలన్నారు.