Minister Farooq: హజ్ యాత్రికులకు రూ.72 లక్షలు మంజూరు
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:59 AM
హజ్-2025 యాత్రలో మొదట విజయవాడ ఎంబార్కేషన్ ఎంచుకుని, తగినంతమంది లేక విమాన సర్వీసు రద్దు కావడంతో హైదరాబాద్ నుంచి హజ్‌యాత్ర పూర్తి చేసుకున్నవారికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
విజయవాడ ఎంబార్కేషన్ ఎంచుకున్నవారికి లబ్ధి: మంత్రి ఫరూక్
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): హజ్-2025 యాత్రలో మొదట విజయవాడ ఎంబార్కేషన్ ఎంచుకుని, తగినంతమంది లేక విమాన సర్వీసు రద్దు కావడంతో హైదరాబాద్ నుంచి హజ్‌యాత్ర పూర్తి చేసుకున్నవారికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ప్రభుత్వం గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ఎంచుకున్న 72మందికి మొత్తం రూ.72 లక్షలను మంగళవారం మంజూరు చేసింది. 2026లో హజ్ యాత్రకు వెళ్లే వారికి కూడా విజయవాడ ఎంబార్కేషన్ ఉంచుకుంటే రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. ఈ నెల 7లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కాగా, మంగళవారం అమరావతి సచివాలయంలో మైనార్టీ సంక్షేమశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆ శాఖకు అనుబంధంగా ఉన్న వివిధ ఆస్తుల జాబితాను సిద్ధం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు.