Minister Veeranjaneya: శాంతిభద్రతల భగ్నానికి జగన్ యత్నం
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:58 AM
రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు.
‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై దాడి దారుణం: మంత్రి డోలా
పార్వతీపురం, జూలై 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు. శనివారం పార్వతీపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ తన పర్యటనలో పెద్ద ఎత్తున గుంపుగా వెళ్లి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అధికారం కోల్పోయిన తర్వాత విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై దాడి చేయడం దారుణమని అన్నారు.