శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో మంత్రి బీసీ దంపతులు
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:34 PM
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరున్ని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి, ఆయన సతీమణి బీసీ ఇందిరమ్మ మంగళవారం దర్శించుకున్నారు.
బనగానపల్లె, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరున్ని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి, ఆయన సతీమణి బీసీ ఇందిరమ్మ మంగళవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్థానిక శ్రీకాళహస్తీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఈవో, ఆర్‌ఆండ్‌బీ అధికారులు, పూజారులు పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. మంత్రి బీసీ జనార్దనరెడ్డి సతీసమేతం గా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు.