Minister Atchannaidu: యూరియా పంపిణీపై దృష్టి సారించండి
ABN , Publish Date - Sep 06 , 2025 | 06:34 AM
యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి, సమస్యను అధిగమించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
కలెక్టర్లకు మంత్రి అచ్చెన్న ఆదేశం
ఇంటర్నెట్ డెస్క్: యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి, సమస్యను అధిగమించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యూరియా సక్రమంగా సరఫరా జరిగేలా చూడాలని, అవసరమైతే టోకెన్ పద్ధతిలో పంపిణీ చేయాలని సూచించారు. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, కడప, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిల్వలు ఎక్కువ ఉన్నచోట నుంచి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు యూరియా తరలించాలన్నారు. కాకినాడ, గంగవరం పోర్టుల నుంచి 53వేల టన్నుల యూరియా సమయానికి చేరుకునేలా పోర్టు, రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.