18 నెలల్లో 18 రోజులు కూడా ఏపీలో లేరు: అనిత
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:23 AM
ప్రస్తుత ప్రభుత్వం 18 నెలల పాలనలో జగన్మోహన్‌రెడ్డి 18 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో లేరని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
విజయనగరం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ప్రభుత్వం 18 నెలల పాలనలో జగన్మోహన్‌రెడ్డి 18 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో లేరని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గురువారం విజయనగరంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ పదవి పోయిన తరువాత పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఏపీలో ఎన్ని రోజులు ఉన్నారో చెప్పాలన్నారు. జగన్ హయాంలో ప్రజా సమస్యలు పరిష్కరించకుండా గాలికొదిలేశారని మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమచేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. టిడ్కో ఇళ్లు ప్రజలకు అందకుండా చేసిన ఘనత జగన్‌దేనని విమర్శించారు. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందజేసే బాధ్యతను ప్రస్తుత ప్రభుత్వం తీసుకుందని అనిత చెప్పారు. ఆయుధాలు విడిచిపెట్టి మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోలేమని, ఆపదలో ఉన్నవారిని మాత్రం సకాలంలో ఆదుకుంటామని తెలిపారు. జగన్ నుంచి ఈ రాష్ర్టానికి విముక్తి కలిగిందని, 2024 తరువాత ఏపీకి మంచి రోజులొచ్చాయని అన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్‌టీజీఎ్‌సతో పరిపాలన సులభతరం అయిందన్నారు. ఇటీవల చిన్నారులు చేపట్టిన మాక్ అసెంబ్లీ ఎంత అద్భుతంగా జరిగిందో అందరికీ తెలిసిందేనన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని, దీంతోనే తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తున్నామని అనిత తెలిపారు.