భూమనకే పరకామణి చోరీ ఆస్తులు: అనగాని
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:38 AM
తిరుమల పరకామణి కేసులో సూత్రధారి, పాత్రధారి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డే అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.
తిరుపతి, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): తిరుమల పరకామణి కేసులో సూత్రధారి, పాత్రధారి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డే అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. సోమవారం తిరుపతిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దేవుడి సోమ్మును దొంగతనం చేసిన వ్యక్తిని కాపాడేందుకు రాజీ చేయడం చరిత్రలోనే వినని, చూడని విషయం. పరకామణిలో చోరీ చేసిన దొంగ నుండి ఆస్తుల బదలాయింపు కరుణాకరెడ్డికే జరిగింది. దేవుడంటే ఎటువంటి నమ్మకం లేని కరుణాకరెడ్డి పింక్ డైమండ్, గోశాలతోపాటు ఇతర అంశాలపై అబద్ధాలు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.’ మంత్రి మండిపడ్డారు.