Minister Achenna slams Jagan: అన్నదాత సుఖీభవపై అవాస్తవాలు రాస్తారా
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:51 AM
అన్నదాత సుఖీభవ పథకంపై అవాస్తవాలు రాస్తారా అంటూ జగన్ పత్రికపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....
జగన్ పత్రికపై మంత్రి అచ్చెన్న ఫైర్
అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ పథకంపై అవాస్తవాలు రాస్తారా అంటూ జగన్ పత్రికపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై అవాస్తవాలు రాస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ గురువారం ఓ ప్రకటనతో మండిపడ్డారు. ‘‘అన్నదాత దుఖీఃభవ- కర్షకుడికి మోసం అంటూ గురువారం నాడు పూర్తి అవాస్తవాలతో సాక్షిలో కల్పిత కథనం ప్రచురించారు. సూపర్‌సిక్స్ హామీల్లో చెప్పినట్లుగానే పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ. 20 వేలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో అటవీ భూమి సాగుహక్కుదారులతో సహా 46.86 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,309 కోట్లు అందించాం. భూమి లేని సాగుదారులందరికీ 20వేలు చొప్పున ఇస్తాం. ఈ-పంట ప్రక్రియ పూర్తికాగానే కౌలురైతులకు లబ్ధి చేకూర్చుతాం.’’ అని అచ్చెన్న వివరించారు.