Miniature Art: పెన్సిల్ ముల్లుపై సూక్ష్మ గణపతి
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:29 AM
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ వినాయక చవితిని...
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ వినాయక చవితిని పురస్కరించుకుని పెన్సిల్ ముల్లుపై బొజ్జ గణపతి రూపాన్ని తీర్చిదిద్దారు. చార్కోల్ పెన్సిల్ ముల్లుపై 8 మి.మీ. వెడల్పు, 23 మి.మీ. ఎత్తు కలిగిన కళాఖండాన్ని తయారు చేశారు. ఇందుకు 6గంటల సమయం పట్టిందని వెంకటేశ్ చెప్పారు.
- ఆంధ్రజ్యోతి, నక్కపల్లి