Pulicat Lake: వలస పక్షుల వినోదం!పులికాట్‌లో విదేశీ అతిథుల సందడి
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:47 AM
నల్లని మబ్బులు గుంపులు.. గుంపులు.. తెల్లని కొంగలు బారులు..బారులు..! తిరుపతి జిల్లా పులికాట్ సరస్సులో విదేశీ వలస పక్షుల సందడి వీక్షకులకు ఇదే అనుభూతిని కలిగిస్తోంది....
నల్లని మబ్బులు గుంపులు.. గుంపులు.. తెల్లని కొంగలు బారులు..బారులు..! తిరుపతి జిల్లా పులికాట్ సరస్సులో విదేశీ వలస పక్షుల సందడి వీక్షకులకు ఇదే అనుభూతిని కలిగిస్తోంది! ఇటీవల కురిసిన వర్షాలకు కళకళలాడుతున్న పులికాట్‌లో ఓవైపు చేపలు, రొయ్యల వేటలో మత్స్యకారుల పడవలు తిరుగుతుండగా, మరోవైపు వారి చుట్టూ పక్షులు విహరిస్తున్నాయి. ఫ్లెమింగోలు, పెయింటెడ్ స్టార్క్స్, తెడ్డుముక కొంగలు గుంపులుగా ఎగిరొచ్చి సరస్సు అంతా పరుచుకున్నాయి. ఇప్పటికే 50వేలకు పైగా పక్షులు చేరుకున్నట్లు అంచనా. ఇవికాక నేలపట్టు నుంచి పెలికాన్‌లు, వెదురుపట్టు నుంచి పెయింటెడ్ స్టార్క్స్ సరస్సులో చేపలవేట సాగిస్తున్నాయి. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు వెళ్లే రోడ్డుకు అటూ ఇటూ, అటకానితిప్ప వేనాడు దారి.. కొరిడి-పేర్నాడు రోడ్డుకు తూర్పు దిక్కున, శ్రీహరికోటకు పడమర దిక్కున, నవాబుపేట ప్రాంతంలో వేలసంఖ్యలో వలస పక్షులు సందడి చేస్తున్నాయి. - సూళ్లూరుపేట, ఆంధ్రజ్యోతి