Nandyal District: కొలనుభారతిలో జల సవ్వడులు
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:42 AM
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని కొలనుభారతి పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో ఉన్న నల్లమల అరణ్యంలో...
కొత్తపల్లి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని కొలనుభారతి పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో ఉన్న నల్లమల అరణ్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలపాతాల హొయలు ఆకట్టుకుంటున్నాయి. ఎత్తయిన కొండపై నుంచి జాలువారుతున్న ఈ జలపాతం కొలనుభారతికి కిలోమీటరు దూరంలో ఉంది. ఈ జలపాతం వద్ద సేదతీరేందుకు యువత పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
గుమ్మితం అందాలు అదరహో..
ఆత్మకూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని నల్లమల అడవుల్లో గుమ్మితం జలపాతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎత్తయిన కొండలు, దుర్భేధ్యమైన అడవి నుంచి ప్రవహిస్తూ ఒక్కసారిగా జాలువారే ఈ జలపాత అందాలను ఆకట్టుకుంటున్నాయి. అయితే గుమ్మితం జలపాతం అందాలను చూడాలంటే మాత్రం అంత సులువు కాదు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో ఇక్కడ నిబంధనలు కఠినంగానే ఉంటాయి. అటవీశాఖ అధికారుల అనుమతి ఉంటేనే గుమ్మితం ప్రాంతానికి చేరుకోగలం.
