చాట్రాయి తహసీల్దార్ సస్పెన్షన్
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:35 AM
చాట్రాయి తహసీల్దార్ డి.ప్రశాంతిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం సాయంత్రం ఉత్వర్వులు జారీ చేశారు.

చాట్రాయి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): చాట్రాయి తహసీల్దార్ డి.ప్రశాంతిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం సాయంత్రం ఉత్వర్వులు జారీ చేశారు. ఆరు నెలల క్రితం ప్రశాంతి చాట్రాయి తహసీల్దార్‌గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఇష్టారాజ్యంగా భూములు మ్యూటేషన్ చేయడం, అవినీతి ఆరోపణలు, కార్యాలయానికి వచ్చిన ప్రజలపై దురుసుగా ప్రవర్తించడంపై ప్రజల నుంచి సీఎంకు, ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి. రెండుసార్లు కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చినా పద్ధతి మార్చుకోలేదు. తహసీల్దార్‌పై వచ్చిన ఆరోపణలపై నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్‌రాజ్ విచారణ జరిపి వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కలెక్టర్‌కు నివేదిక ఇవ్వడంతో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.