యూనివర్సిటీలకు మెమోలు జారీ
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:46 PM
జిల్లాలో మూడు యూనివర్సిటీలకు సంబంధించిన వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలపై సంజాయిషీ కోరుతూ ఆయా యూనివర్సిటీలకు కలెక్టర్ ఇటీవలే మెమోలు జారీ చేశారు.
వ్యతిరేక కథనాలపై కలెక్టర్ సీరియస్
కర్నూలు అర్బన్ , అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు యూనివర్సిటీలకు సంబంధించిన వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలపై సంజాయిషీ కోరుతూ ఆయా యూనివర్సిటీలకు కలెక్టర్ ఇటీవలే మెమోలు జారీ చేశారు. ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో(పీజీఆర్‌ఎస్) ఫిర్యాదుల వెల్లువతో జిల్లాలోని మూడు వర్సిటీలపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఓ వర్శిటీపై ఇదే నెలలో వివిధ పత్రికల్లో ఆరు వ్యతిరేక కథనాలు, అడ్వర్స్ వార్తల బ్లాగ్‌లో నమోదు కావడంతో సం జాయిషీ కోరడం వర్సిటీల్లో చర్చనీయాంశ మైంది. ఈక్రమంలో ఓ వర్సిటీ రిజిస్ర్టార్ స్వయం ప్రతిపత్తి(ఆటానమ్‌స)తో కూడిన వర్సిటీలపై కలెక్టర్ పెత్తనం ఏమిటని కొందరు ప్రొఫెసర్ల వద్ద ప్రస్తావించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పాలన అం తా సవ్యంగా సాగినప్పుడు సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం ఉండదు కదా.. తప్పులు చేయనప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయంటూ కొందరు ప్రొఫెసర్లు రిజిస్ర్టార్ల తీరుపై చర్చించుకోవడం విశేషం.