Polavaram Project: ‘మేఘా’కు సేఫ్టీ ఎక్స్‌లెన్స్ అవార్డు
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:37 AM
పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) అరుదైన మైలురాయిని చేరుకుంది.
పోలవరం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) అరుదైన మైలురాయిని చేరుకుంది. 2020లో జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభించినప్పటి నుంచి ఒక్క పనిదినం కూడా వృథా కాకుండా సురక్షితంగా 2.5 కోట్ల పనిగంటలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించినందుకు గానూ ఏపీ జెన్‌కో నుంచి ‘సేఫ్ మ్యాన్ అవర్స్ ఎక్సెలెన్స్ అవార్డు’ను అందుకుంది. దీనికి సంబంధించిన ధ్రువపత్రాన్ని ఏపీ జెన్‌కో ఎస్‌ఈ కె.రామభద్రరాజు మేఘా సంస్థ అసోసియేట్ మేనేజర్ ప్రగడ నంద నాగకృష్ణకు బుధవారం అందజేశారు.