Share News

మెగా పీటీఎంను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Dec 02 , 2025 | 10:58 PM

జిల్లాలో ఈ నెల 5న నిర్వహించనున్న మెగా తల్లి దండ్రులు- ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని అధికారులందరూ సమ న్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్‌ రాజకుమారి సూచించారు.

  మెగా పీటీఎంను విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, డిసెంబ రు2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 5న నిర్వహించనున్న మెగా తల్లి దండ్రులు- ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని అధికారులందరూ సమ న్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్‌ రాజకుమారి సూచించారు. మంగళవారం ఆమె తమ చాంబర్‌లో మెగా పీటీఎంపై సంబంధిత అధికారులతో టెలికాన్పరెన్స నిర్వ హించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ 5న అన్ని ప్రభుత్వ పాఠ శాలలు, కళాశాలలలో ఈకార్యక్రమం నిర్వహించాలన్నారు. ఎంఈవోలు ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులకు రమ్మని ఆహ్వానించాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు, ఆర్డీవో, అధికారులు హాజరుకావాలన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 10:58 PM