Share News

Parent Teacher Meeting: నేడు మెగా పీటీఎం 3.0

ABN , Publish Date - Dec 05 , 2025 | 04:57 AM

మెగా పేరెంట్‌-టీచర్స్‌ సమావేశం(పీటీఎం)-3.0 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.

Parent Teacher Meeting: నేడు మెగా పీటీఎం 3.0

  • 45 వేల పాఠశాలల్లో నిర్వహణకు ఏర్పాట్లు

  • మన్యంలో పాల్గొననున్న సీఎం, లోకేశ్‌, చిలకలూరిపేటలో పవన్‌

అమరావతి/చిలకలూరిపేట, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): మెగా పేరెంట్‌-టీచర్స్‌ సమావేశం(పీటీఎం)-3.0 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 45వేల ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో మెగా పీటీఎం నిర్వహించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని భామిని మోడల్‌ స్కూల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ పాల్గొంటున్నారు. మిగిలిన పాఠశాలల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మెగా పీటీఎం జరుగుతుంది. కాగా, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని శారద జెడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం-3.0లో పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్‌ కృతిక శుక్లా తెలిపారు.

Updated Date - Dec 05 , 2025 | 04:59 AM