గిన్నిస్ రికార్డు కోసమే మెగా పీటీఎంలో సంతకం
ABN , Publish Date - Jul 06 , 2025 | 04:49 AM
మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) 2.0లో 2.28 కోట్ల మందికి పైగా పాల్గొనేలా చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నామని సమగ్ర శిక్ష పథకం సంచాలకుడు బి .శ్రీనివాసరావు తెలిపారు.

సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు
అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) 2.0లో 2.28 కోట్ల మందికి పైగా పాల్గొనేలా చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నామని సమగ్ర శిక్ష పథకం సంచాలకుడు బి .శ్రీనివాసరావు తెలిపారు. గిన్నిస్ బృందం ఇచ్చిన సూచనల మేరకు రిజిస్ట్రేషన్‌కు సాక్ష్యంగా టీచర్లు, తల్లిదండ్రులు కాకుండా.. అదే పాఠశాల పరిధిలో.. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు, రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి, దాత, పూర్వ విద్యార్థి.. ఇలా ఎవరినైనా సంతకం చేయాల్సి ఉంటుందన్నారు. గిన్నిస్ రికార్డు కోసం లీప్ యాప్‌లో మెగా పీటీఎం 2.0 రిజిస్ట్రేషన్‌లో ఇతర వ్యక్తి సాక్ష్యం అవసరమని, అంతకుమించి సంతకం వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని పేర్కొన్నారు.