Share News

21న మెగా జాబ్‌మేళా

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:51 PM

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ఈనెల 21న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంతరెడ్డి తెలిపారు.

21న మెగా జాబ్‌మేళా

నంద్యాల ఎడ్యుకేషన, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ఈనెల 21న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంతరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జాబ్‌మేళాకు సంబంధించిన కరపత్రాలను కలెక్టర్‌ రాజకుమారిగణియాతో పాటు జిల్లా అధికారులు విడుదల చేశారు. శ్రీకాంతరెడ్డి మాట్లాడుతూ 21న నంద్యాల పట్టణంలోని ఎనటీఆర్‌ షాధీఖానాలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 11 ప్రముఖ ప్రైవేట్‌ కంపెనీలు పాల్గొంటున్నాయని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - Jul 14 , 2025 | 11:51 PM