Share News

Mega DSC Teacher Selection: నేడే మెగా డీఎస్సీ ఎంపిక జాబితాలు

ABN , Publish Date - Sep 15 , 2025 | 03:27 AM

మెగా డీఎస్సీలో కీలకమైన ఉద్యోగ ఎంపిక జాబితాలను పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించనుంది. ఎవరెవరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు...

Mega DSC Teacher Selection: నేడే మెగా డీఎస్సీ ఎంపిక జాబితాలు

  • సుమారు 16 వేల మందికి ఉద్యోగాలు

  • మిగిలిపోయిన పోస్టులు 300కు పైనే

  • 19న అమరావతిలో మెగా డీఎస్సీ సభ

  • 22 నుంచి 29 వరకు కొత్త టీచర్లకు శిక్షణ

  • దసరా సెలవుల అనంతరం విధుల్లోకి!

అమరావతి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో కీలకమైన ఉద్యోగ ఎంపిక జాబితాలను పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించనుంది. ఎవరెవరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు? అనే పేర్లతో తుది ఎంపిక జాబితాలు విడుదల చేయనుంది. వీటిని జిల్లాల కలెక్టర్‌, డీఈవోల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. అలాగే జ్ట్టిఞట://్చఞఛీటఛి.్చఞఛిజటట.జీుఽ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని డీఎస్సీ-2025 కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, నోటిఫికేషన్‌లో పేర్కొన్న 16,347 పోస్టులకుగానూ సుమారు 300కు పైగా మిగిలిపోయినట్లు తెలిసింది. దాదాపు 16 వేల మంది అభ్యర్థుల పేర్లను ఎంపిక జాబితాల్లో ప్రకటించనున్నారు. పలు మేనేజ్‌మెంట్లలో కొన్ని సామాజికవర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో ఈ పోస్టులు మిగిలాయి. తొలుత 600కు పైగా పోస్టులు మిగిలే పరిస్థితి ఏర్పడగా.. మిగిలిన పోస్టులను వీలైనంత మేర తగ్గించేందుకు ఏడు విడతల్లో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. ఆ అభ్యర్థులు ఏవైనా కారణాలతో తిరస్కరణకు గురైతే.. ఆ తర్వాత మెరిట్‌లో ఉన్న వారిని ఈనెల 13 వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. దీంతో చివరికి దాదాపుగా 16 వేల పోస్టులకు అభ్యర్థులు ఎంపికై ఉద్యోగాలు సాధించారు. మిగిలిన పోస్టులను తర్వాత డీఎస్సీల్లో భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19న అమరావతి సచివాలయం సమీపంలో భారీ సభ నిర్వహించి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వనున్నారు. 30 వేల మందికి పైగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఈనెల 22 నుంచి 29 వరకు కొత్త టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దసరా సెలవుల అనంతరం బడులు తెరుచుకునే రోజున కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు.

పకడ్బందీగా మెగా డీఎస్సీ ప్రక్రియ

రాష్ట్రవ్యాప్తంగా 16,347 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ 20న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిందని డీఎస్సీ-2025 కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్‌ 20 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. 3,36,300 మంది అభ్యర్థుల నుంచి 5,77,675 పోస్టులకు దరఖాస్తులు అందాయన్నారు. జూన్‌ 6 నుంచి జూలై 2 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక, తుది ‘కీ’లు విడుదల చేశామన్నారు. టెట్‌ మార్కుల సవరణలకు పలుమార్లు అభ్యర్థులకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 03:27 AM