Mega DSC 2025: మెగా డీఎస్సీ సభ వాయిదా
ABN , Publish Date - Sep 19 , 2025 | 04:56 AM
మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేసేందుకు శుక్రవారం అమరావతిలో నిర్వహించతలపెట్టిన సభ వాయిదా పడింది.
భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం
అమరావతి/తుళ్లూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేసేందుకు శుక్రవారం అమరావతిలో నిర్వహించతలపెట్టిన సభ వాయిదా పడింది. ఈ మేరకు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని సభను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సభను ఎప్పుడు నిర్వహించాలనే దానిపై తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రకటన వెలువడేసరికే రాయలసీమ జిల్లాల నుంచి అభ్యర్థులు బయల్దేరారు. వాయిదా సమాచారం తెలియగానే మధ్యలో వెనుదిరిగారు.